కన్నడ సినీ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాద గౌడ దంపతులు తమ నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడను కోల్పోయారు. డిసెంబర్ 15వ తేదీ సోమవారం చిన్నారి సోనార్ష్ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. కీర్తన్ నాదగౌడ కుటుంబం ఈ తీవ్ర శోకంలో మునిగిపోగా, సినీ వర్గాలు ఈ చిన్నారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ…