Kirtan Nadagoud : కన్నీరు పెట్టిస్తున్న దుర్ఘటన.. లిఫ్ట్ ప్రమాదంలో దర్శకుడి కుమారుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సినీ పరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడిగా పరిచయం కానున్న కీర్తన్ నాద గౌడ దంపతులు తమ నాలుగున్నరేళ్ల కుమారుడు సోనార్ష్ కె. నాదగౌడను కోల్పోయారు. డిసెంబర్ 15వ తేదీ సోమవారం చిన్నారి సోనార్ష్ అనుకోకుండా లిఫ్ట్‌లో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. కీర్తన్ నాదగౌడ కుటుంబం ఈ తీవ్ర శోకంలో మునిగిపోగా, సినీ వర్గాలు ఈ చిన్నారి అకాల మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కీర్తన్ నాదగౌడ దంపతులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
Also Read : Upasana : మెగా ఫ్యాన్స్‌కు .. ఉపాసన నుంచి డబుల్ గుడ్ న్యూస్
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
కీర్తన్ నాదగౌడ కన్నడలో అనేక చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అయిన ‘కేజీఎఫ్’ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ సమర్పణలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఒక హారర్ చిత్రంతో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సంతోషకరమైన సమయంలో ఈ విషాదం జరగడం ఆయన దంపతులకు తీరని లోటుగా మారింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా సంతాపం ప్రకటించారు. పుత్రశోకం నుంచి తేరుకునే మనోధైర్యాన్ని దంపతులకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆ భగవంతుని వేడుకున్నారు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!