Kiren Rijiju: 2019 క్రిమినల్ పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి నాలుక నరికివేస్తానని తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు బెదిరించడంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా శనివారం ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నిరాశాలో ఉందని, న్యాయవ్యవస్థపై దాడి చేస్తోందని అన్నారు. కానీ ఇలాంటి వాటిపై ప్రభుత్వం సైలెంట్ గా ఉండదని వార్నింగ్ ఇచ్చారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ జైలుశిక్ష, అనర్హత వేటు గురించి జర్మనీ స్పందించింది. ఈ అంశాన్ని గమనిస్తున్నామంటూ ఆ దేశ విదేశాంగ శాఖ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉంటే ఈ విషయంలో జర్మనీ కలుగజేసుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జర్మనీకి థాంక్స్ చెప్పడం ఇప్పుడు వివాదాస్పదం అయింది.
Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది.…
Kiren Rijiju: దేశ ప్రజలను విభజించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ఐక్యతకు అత్యంత ప్రమాదకరమని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్రమోదీని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలపై రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.
"Public Is The Master...": Law Minister's Latest Swipe At Supreme Court: కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ నెలకొంది. సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారం గత రెండు నెలలుగా కేంద్రం పెండింగ్ లో ఉంచింది. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తాజాగా ఈ రోజు కేంద్రం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
Uniform Civil Code: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి అమలుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం గురువారం రాజ్యసభకు తెలియజేసింది. యూనిఫాం సివిల్ కోడ్ కు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించి సిఫారసులు చేయాలని ప్రభుత్వం 21వ లా కమిషన్ ను కోరిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు సభకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
BBC Documentary on Modi: భారతదేశంలో కొంతమంది సుప్రీంకోర్టు కన్నా బీబీసీనే ఎక్కువ అని భావిస్తున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. కొంతమందిని సంతోషపెట్టడానికి ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని.. వారు దేశ గౌరవాన్ని, ప్రతిష్టను ఏ స్థాయిలో అయినా తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలిజీయం వ్యవస్థపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రస్తుత ప్రక్రియపై ఆందోళనలు ఉన్నందున ఈ విషయంపై చర్చ జరగాల్సి ఉందన్నారు.