చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. లివర్, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే లాంగ్యా హెనిపావైరస్ అనే కొత్త జూనోటిక్ వైరస్‌ను చైనా గుర్తించింది. ఈ కొత్త వైరస్ ఇప్పటికే 35 మందికి సోకినట్లు సైంటిస్టులు గుర్తించారు. లాంగ్యా వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందింది. ప్రతీ జబ్బుకు చికిత్స అందుబాటులో ఉన్నది. అవయావాల మార్పిడి కూడా వేగంగా జరుగుతున్నది. అవయవదానం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అవయవాల కొరత వేధిస్తున్నది. మనిషికి అత్యవసరంగా అవయవ మార్పిడి చేయాల్సి వచ్చినపుడు దానికి ప్రత్యామ్నాయం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. జంతువుల అవయవాలను మనిషికి అమర్చే అంశంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్‌కు చెందిన పరిశోధకులు వినూత్న ప్రయోగం…
కరోనా ఫస్ట్ వేవ్ తగ్గిందని.. అంతా రిలాక్స్ అవుతోన్న సమయంలో.. సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది.. మధ్యలో.. బ్లాక్ ఫంగస్ వచ్చి చేరింది.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది.. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) బయట పడడం కలకలం రేపుతోంది.. పాట్నాలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు…
కరోనా మహమ్మారి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ఇక ఊపిరి తిత్తుల తరువాత దీని ప్రభావం కిడ్నీలపై అధికంగా కనిపిస్తోంది. కిడ్నీల జబ్బులతో బాధపడేవారు కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే కిడ్నీలు దెబ్బతింటాయని, ఫలితంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా బారిన పడిన సమయంలో ఏవైనా చిన్న…