అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం…
బాలీవుడ్ హాట్ కపుల్ కియారా అడ్వాణీ – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులు అభిమానులకు సంతోషకరమైన వార్త చెప్పారు. ఈ జంట తాజాగా తల్లిదండ్రులు అయ్యారు. ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో కియారా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది ఫిబ్రవరి 28న తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కియారా-సిద్ధార్థ్ జంట, తాజాగా తమ జీవితంలో కొత్త శకం ప్రారంభించింది. ఈ వార్తపై వారి ఫ్యాన్స్, బాలీవుడ్ సెలబ్రిటీలు…