2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్‌లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది.
Kia Sonet facelift: కొరియన్ కార్ మేకర్ కియా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో మంచి స్థానాన్ని సంపాదించింది. కియా నుంచి సోనెట్, సెల్టోస్, కారెన్స్, ఈవీ6 వాహనాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పటికే తన సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసిన కియా, తాజాగా కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.