పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అయాజ్ సాదిక్ జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం రేపు (మంగళవారం) జరుగనుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులలో ఇటీవల ఉగ్రవాద దాడులు పెరిగిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.