మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న రెండో సినిమా ‘ఖిలాడీ’. గతంలో పదేళ్ళ క్రితం రవితేజతోనే రమేశ్ వర్మ ‘వీర’ చిత్రం రూపొందించాడు. రెండు పాటలు మినహా పూర్తయిన ‘ఖిలాడీ’ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆర్ట్ డైరెక్టర్ గాంధీ నడికుడికర్ వేసిన భారీ సెట్ లో డిసెంబర్ 13 నుండి రవితేజ, మీనాక్షి చౌదరిపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిసున్న ఈ పాటకు…