BJP: ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్‌ని ఉద్దేశిస్తూ ఇటీవల కాంగ్రెస్‌ని ‘‘అర్బన్ నక్సల్స్’’ నడిపిస్తున్నారంటూ విమర్శించారు. ప్రధాని మోడీని వ్యాఖ్యల్ని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. బీజేపీ ‘‘టెర్రరిస్టుల పార్టీ’’గా విమర్శించారు. దీంతో ఇరు పార్టీల మధ్య వివాదం మొదలైంది. బీజేపీ ప్రజల్ని కొట్టి చంపడం, గిరిజనులు-దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నారు.