టీఆర్‌ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కలిస్తే అది పెద్ద వార్త కాదు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు అసంతృప్తి నేతలు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఖమ్మం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం వెనుక ఏం జరుగుతుందనేది చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌గర్…