దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి ఉత్సవాలను గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బొజ్జగణపయ్య కొలువుదీరారు. హైదరాబాద్ ఖా శాన్… ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఖైరతాబాద్ మహా వినాయకుడు.. స్వామి కి ఇరువైపుల కుడి పక్క శ్రీ జగన్నాథ స్వామి, లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమ పక్క లలిత త్రిపుర సుందరి… శ్రీ గజ్జాలమ్మ దేవి కొలువుదీరారు..…
Khairatabad Ganesh: ప్రముఖ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం వినాయక చవితికి ఒకరోజు ముందు ప్రారంభమైంది. 70 ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు.