కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్‌గా విడుదలైంది. సుమారు 121 కేంద్రాలలో 297 థియేటర్లలో ఈ సినిమాను గురువారం నుండి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ తమిళ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక…