Karthi: రష్యాలో ‘ఖైదీ’ గ్రాండ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్‌గా విడుదలైంది. సుమారు 121 కేంద్రాలలో 297 థియేటర్లలో ఈ సినిమాను గురువారం నుండి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ తమిళ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక స్టార్ హీరో నటించిన చిత్రంలో హీరోయిన్, పాటలు వుండడం సహజం. కానీ ‘ఖైదీ’ చిత్రం ఆ ఫార్ములాను బ్రేక్ చేసింది. హీరోయిన్ లేదు. పాటలూ లేవు. ఇలాంటి విభిన్నమైన ‘ఖైదీ’ చిత్రం హీరో కార్తీ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ వంటి దక్షిణ భారత భాషలన్నింటిలోనూ ‘ఖైదీ’కి చక్కటి స్పందన లభించింది.
ప్రస్తుతం, ఈ చిత్రం హిందీ రీమేక్, ‘భోలా’ పేరుతో నిర్మాణంలో ఉంది, ఇందులో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘భోలా’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్, రిలయన్స్, డి-సిరీస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇవాళ ఈ సినిమా రష్యాలోనూ విడుదల కావడం విశేషం. రష్యాలో ఇంత భారీ స్థాయిలో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం గమనార్హం. దీని కోసం వివిధ ప్రచార కార్యక్రమాలు, ఈవెంట్‌లను ప్లాన్ చేశారు. 4 సీజన్స్ క్రియేషన్స్ ఈ సినిమాను రష్యాలో విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా జపాన్ లోనూ విడుదలై చక్కని విజయాన్ని అందుకొంది.
Also Read
తాజావార్తలు
-
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు
-
Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!
-
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!
-
Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
ట్రెండింగ్
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!