KH237: విక్రమ్ సినిమాతో లోక నాయకుడు కమల్ హాసన్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేశాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా లాభాలను అందుకొని.. తన బ్యానర్ ను విస్తరిస్తున్నాడు. ఇక విక్రమ్ తరువాత కమల్ నటిస్తున్న చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నీ కమల్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తో పాటు మణిరత్నం సొంత బ్యానర్ అయిన మద్రాస్ టాకీస్ తో కలిసి నిర్మిస్తున్నాడు.