పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై రాళ్ల దాడి కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేయగా జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్‌పై కేసు నమోదు అయ్యే ఛాన్స్‌తో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది. ఈ…
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో విచారణ ముమ్మరం చేసిన పోలీసులు నిన్న(సోమవారం) నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ చిరుమర్తి లింగయ్యకు నోటీసులు అందజేసిన సంగతి తెలిసిందే.
కొత్త రేషన్ కార్డుల మంజూరీపై తెలంగాణ ప్రభుత్వం కీలక సమాచారం ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల మంజూరీ పై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయింది. ఉపసంఘం చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఉప సంఘం సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహా పాల్గొన్నారు. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది.
టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.