మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు మెగాస్టార్ కామెడీ టైమింగ్‌కి అనిల్ రావిపూడి కరెక్ట్‌గా సూట్ అవుతాడని భావిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే సినిమాలో నయనతార హీరోయిన్‌గా ఎంపిక చేసినప్పటి నుంచి సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా…
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్‌మేకర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు, శ్రీమతి అర్చన సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని అద్భుతమైన లొకేషన్స్‌లో శరవేగంగా జరుగుతోంది. #Mega157 టీం ప్రస్తుతం కేరళలో ఒక కలర్‌ఫుల్, మెలోడియస్ మాంటేజ్ సాంగ్‌ను చిత్రీకరిస్తోంది. ఈ పాటలో…