కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేరళ.. గతంలో ఇచ్చిన సడలింపులు యథావిథిగా కొనసాగుతాయని ప్రకటించింది.. కేరళలో ఇంకా భారీగానే కోవిడ్ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.. దీంతో.. ఈ నెల 16వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించినట్టు లెఫ్ట్ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈనెల 12, 13 తేదీల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమలు చేయనున్నారు.. ఈ సమయంలో నిత్యావసరాల షాపులు, పరిశ్రమలకు ముడిపదార్ధాలు అందించే అవుట్ లెట్లు, నిర్మాణ రంగ కార్యకలాపాలతో పాటు బ్యాంకులు…