Kerala Budget: కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. పెట్రోల్, డిజిల్, మద్యంపై సెస్ విధించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. డిజిల్, పెట్రోల్, మద్యంపై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు.