Kerala: కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాజాగా కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్ మాట్లాడుతూ.. పినరయి విజయన్ ప్రభుత్వం కన్నా ఆవులే మేలు అంటూ వ్యాఖ్యలు చేశారు. కేరళలో మంత్రుల కన్నా ఆవులే ప్రజలకు ఎక్కువ సహకారాన్ని అందిస్తున్నాయని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఆవుల వల్ల ప్రజలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు.