Kerala : కేరళలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు లోయలో పడి నలుగురు చనిపోయారు. మృతిచెందిన వారిలో ఓ చిన్నారి కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
కేరళలోని కన్నూర్ జిల్లా ఆసుపత్రి సమీపంలో కదులుతున్న కారులో మంటలు చెలరేగడంతో గర్భిణి, ఆమె భర్త సజీవదహనమయ్యారు. మూడేళ్ల చిన్నారి సహా వెనుక సీట్లలో ప్రయాణిస్తున్న మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.