లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. కేజ్రీవాల్ రాజీనామా చేయలేదని, ఆయన జైలుకు వెళ్లినా.. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని పార్టీ చెబుతోంది.
కేజ్రీవాల్‌ను ఇవాళ ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. దాదాపు 13 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది.