East Godavari Floods: తూర్పు గోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో పెద్ద కాలువకు ఆకస్మిక వరద వచ్చింది. దీంతో గోకవరంలోని సాయి ప్రియాంక కాలనీ, పోలవరం నిర్వాసితుల కాలనీ తదితర ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. ఇళ్ల చుట్టూ నీళ్లు చేరడంతో గోకవరం కాలనీల్లో ప్రజలు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.