ఎన్నికల ప్రచారంలో భాగంగా.. తుక్కుగూడలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేసీఆర్ అవినీతి, అసమర్థ పాలనతో తెలంగాణ చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోలేదని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలిసి డ్రామా చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయ జీవితం ప్రారంభం అయిందే కాంగ్రెస్ నుండే అని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాసంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు మద్దతు…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈసారి కేసీఆర్ సర్కారుని ఇంటికి పంపాలా వద్దా.. 2024లో మోదీని మరోసారి ప్రధాని కావాలా వద్దా అని అన్నారు. రామప్ప దేవాలయంలోని రుద్రేశ్వరస్వామికి నమస్కరించి చెబుతున్నా.. 70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని అడ్డుకుందని ఆరోపించారు. 2019లో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన…
తెలంగాణలో కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణం చేస్తుంది.. కర్ణాటకలో 100 కోట్ల మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేశారు.. నిన్ననే సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని డీకే శివకుమార్ అన్నారు.
సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
నేడు గులాబీ బాస్ కేసీఆర్ నాలుగు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనబోతున్నారు. మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లో నిర్వహించనున్న బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగం చేయనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండుసార్లు కేసీఆర్ ను ఎమ్మెల్యేను చేస్తే... మల్లన్న సాగర్ లో మిమ్మల్ని నిండా ముంచాడని ఆరోపించారు. కొండపోచమ్మలో మిమ్మల్ని తోసిండు, రంగనాయక్ సాగర్ లో ముంచిండని విమర్శించారు.
నిర్మల్ జిల్లాలోని చించోలి - బిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు రైతు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకే కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు.
మోసపూరిత వాగ్దానాలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీపై ప్రజలు ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి కోరారు. ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి తొమ్మిది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి మాట తప్పారు.
Nani: ఈ కాలంలో సినిమా ఎలాగైనా తీయనీ.. ఎంత ఖర్చు అయినా పెట్టనీ.. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఉండనీ.. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోతే మాత్రం ప్రేక్షకులు థియేటర్ వైపు ముఖం కూడా చూడడం లేదు. మా సినిమాలో కంటెంట్ ఉంది.. ప్రేక్షకులే వస్తారు అనుకోని ధైర్యంగా ప్రమోషన్స్ చేసుకోకుండా కూర్చుంటే.. ఖతం.. టాటా.. గుడ్ బై చెప్పేస్తున్నారు.
చెరువులను మింగిన ఘనుడు మల్లారెడ్డి.. ఇక్కడి ప్రజలకు కేసీఆర్ ఇచ్చిందేం లేదు.. ఒక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు తప్ప.. టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి కేసీఆర్ మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.