CM Revanth Reddy: యశోద ఆస్పత్రికి సీఎం.. కేసీఆర్ ను పరామర్శించనున్న రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికాసేపట్లో హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవలే తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన కేసీఆర్ ను రేవంత్ రెడ్డి సహా ఇతర మంత్రులు పరామర్శించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12.30 గంటలకు యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించనున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. కేసీఆర్ నాలుగు రోజుల క్రితం ఫామ్ హౌస్ లో జారిపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం కేసీఅర్ దగ్గర కేటీఆర్ ,కవిత ,హరీష్ రావు వున్నారు. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. కాసేపట్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తరదితరులు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
Read also: Buddha Venkanna: చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి.. ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది
Also Read
ఎన్నికల్లో ఓటమి ఎదురైన నాటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజుల క్రితం ఫామ్ హౌస్‌లో కేసీఆర్ జారిపడ్డారు. దీంతో ఆయన తుంటి ఎముక విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో 20 మంది వైద్యుల బృందం శస్త్ర చికిత్సను పూర్తి చేసింది. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యుల బృందం తెలిపింది. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి వైద్యులు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కేసీఆర్ కు నడుం నొప్పి తగ్గిందని, రోజంతా విశ్రాంతి తీసుకున్నారని అంటున్నారు. మల్టీడిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తికి 12 గంటలలోపు నడవాలని, అందులో భాగంగానే శనివారం కేసీఆర్ కొంతసేపు నడిచారని వైద్యుల బృందం తెలిపింది. ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ నడిపించారని తెలిపారు. 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు కేసీఆర్‌కు సూచించారు.
Buddha Venkanna: చంద్రబాబు ఆ సీటు నాకు ఇవ్వండి.. ఇవ్వకుంటే ఆప్షన్ బి ఉంది
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!