KTR: ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నా
కేటీఆర్ కు నాయకత్వం అప్పగిస్తే సహకరిస్తాను అని తేల్చి చెప్పారు. నేను క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తను.. గత 25 ఏళ్లుగా పార్టీలో నిబద్ధతో పని చేస్తున్నాను.. నా లీడర్ కేసీఆర్.. ఆయన చెప్పినట్లు నడుచుకుంటానని హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణలో రాజకీయ అగ్గి ఈసారి డిఫరెంట్‌గా రాజుకోబోతోందా అంటే... అవును... అలాగే కనిపిస్తోందని చెబుతున్నారు పొలిటికల్ పరిశీలకులు. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటున్నారు. తాజాగా మీడియాతో కవిత అన్న మాటలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సామాజిక తెలంగాణ విషయమై ఈనెల మొదట్లో కవిత అన్న మాటల సెగలే ఇప్పటికీ తగ్గలేదు.
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్ఎస్... ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం... జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట.
PCC Chief Mahesh Goud: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించడంపై తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆయన ఏ కులం అనేది క్లారిటీ ఇవ్వాలి? అని డిమాండ్ చేశారు. ముదిరాజా లేక రెడ్డి నా అనేది.. బీజేపీలో పదవులు రాలేదని మాపై అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు.
Addanki Dayakar: జనగామ జిల్లా పాలకుర్తిలోని బృందావన్ గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ తీరును తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా ఆ సభలో కేసీఆర్ తన కుమారుడు కేటీఆర్, అల్లుడు హరీష్ రావులకు కూడా మాట్లాడే అవకాశం…
గచ్చిబౌలిలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ చేరుకున్నారు. అమెరికా వీసా కోసం కాన్సులేట్ కార్యాలయానికి వచ్చారు. ఇప్పటికే సికింద్రాబాద్ పాస్ పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ రెన్యువల్ కి సంబంధించిన లీగల్ టీమ్ సమర్పించారు.. ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నేరుగా అమెరికన్ కాన్సులేట్ కి చేరుకున్నారు.. కేసీఆర్ తో పాటు జోగినపల్లి సంతోష్, జీవన్ రెడ్డి ఉన్నారు..
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు వేగవంతానికి చర్యలు చేపట్టి 2027 మార్చి నాటికి ఉదండాపూర్ వరకు నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రాజెక్టుల కోసం భూ సేకరణకు సత్వర చర్యలకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నాం.. పాలమూరు జిల్లా గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది అని ఆరోపించారు.
Gutha Sukender Reddy : పెహల్గం ఘటన తర్వాత దేశ ప్రజల అభిప్రాయం మేరకు కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్లగొండ క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. యుద్ధం కంటే ఉగ్రవాద నిర్మూలన చాలా కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. Gold Rates:…
EX Minister Jagadish Reddy: ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభపై ప్రజల్లో చర్చ జరుగుతోంది అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఇక, సభకు వచ్చిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు.. బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పేరు కేసీఆర్ చెప్పలేదని సీఎం బాధపడుతున్నారు ఎద్దేవా చేశారు.