ఎన్నికల నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టింది అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. కస్టమ్ మిల్లర్ల నోట్లో మట్టి కొట్టే పని చేశారు.. వేయి కోట్ల టర్నోవర్, వంద కోట్ల లాభం ఉన్న మిల్లర్లు మాత్రమే పాల్గొనాలి అని కండిషన్ పెట్టారు.. ఎమెఎస్పీ కన్నా ఎక్కువకు టెండర్లు పోతే ఒకే.. తక్కువకు పోతే మాత్రం రాష్ట్రానికి తీవ్ర నష్టం అని.. ఎమెఎస్పీకి కొనేందుకు రాష్ట్ర రైస్ మిల్లర్లు రెడీగా ఉన్నారు అని ఆయన వ్యాఖ్యనించారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో 4, 5 రూపాయలకి అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని ఎంపీ అర్వింద్ తెలిపారు.
Read Also: Armaan Malik: ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?
ఈ బియ్యం అమ్మకం ద్వారా నాలుగు వేల కోట్ల కమిషన్ దందుకోవాలని కేసీఆర్ ప్లాన్ చేశాడు అని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో వర్షాలు పడతాయని ముందే చెప్పిన.. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో గాడిదలు కాశాడు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. కల్వకుంట్ల వాళ్ళకన్న పందికొక్కులు నయం.. ధాన్యం అమ్మకంపై మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత స్పందించాలి అని ఆయన డిమాండ్ చేశారు. వంద మందికి ఒక్కో అభ్యర్థికి 40 కోట్ల రూపాయలను ఇవ్వాలని కేసీఆర్ అనుకుంటున్నారు అని ధర్మపురి అర్వింద్ తెలిపారు. ఈవీఎంల గురించి, బటన్ల గురించే నేను మాట్లాడలేదు అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ అన్నారు. నా వ్యాఖ్యలు ట్విస్ట్ చేశారు.. నేను అన్న మాటలకి కట్టుబడి ఉన్నాను.. ఇక కవిత ఎన్ని చేసిన నిజామాబాద్ లో మూడో స్థానమే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Viral Video: నువ్వు ఎక్కడున్నా వదలా.. మింగేయడమే నా పని