ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు రాజీనామా పత్రాన్ని కేసీఆర్ అందజేశారు. కాన్వాయ్ లేకుండానే ప్రగతి భవన్ నుంచి రాజ్‌భవన్‌కు కేసీఆర్ బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్‌కు అదే రేంజ్‌లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని…