ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రెండు రోజుల క్రితం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ బుధవారం మధ్యాహ్నం 12.47 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హస్తినలో మకాం వేశారు.. మొదట మూడు రోజుల పర్యటన అంటూ ఢిల్లీ బయల్దేరిన సీఎం.. ఇప్పుడు హస్తిన పర్యటనను పొడిగించారు.. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన ఆయన.. ఇవాళ కూడా ఢిల్లీలోనే బస చేయనున్నారు.. రేపు మరికొన్ని భేటీలు జరగనున్నట్టు తెలుస్తోంది.. సోమవారం రోజు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసే అవకాశం ఉండగా.. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్‌ను…