తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై ఏపీ మంత్రి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు చేయడం తనకు బాధ కలిగించిందన్నారు. సీఎం చంద్రబాబు స్టేట్స్ మెన్ అని ప్రపంచమంతా కీర్తిస్తుందని.. కేసీఆర్‌కి నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత? అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రాకతో ఏపీలో రామరాజ్యం ఆరంభమైందని, అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ఆనం స్పష్టం చేశారు. మంత్రి ఆనం ఈరోజు మీడియాతో మాట్లాడుతూ…
Bhatti Vikramarka : తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. శాసనసభకు వచ్చే ధైర్యం లేని వారు, బయట ఉండి అడ్డగోలుగా మాట్లాడటం తగదని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గొప్ప తీర్పు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. “రాష్ట్రంలోని 85…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికల్లో ఒక రౌడీ షీటర్‌కు టికెట్ ఇచ్చిందని తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ ప్రజల విజ్ఞతకు, తెలివితేటలకు ఈ ఎన్నిక ఒక కఠిన పరీక్ష పెట్టిందని అభిప్రాయపడ్డారు. విజ్ఞులైన ప్రజలు రౌడీ షీటర్ కుటుంబం నుంచి వచ్చిన అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ‘కాంగ్రెస్ హయాంలో తెలంగాణ గుల్ల అయింది.…
తెలంగాణ సెంటిమెంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ పాతది అయిపోయింది.. ఇంకా ఏదైనా కొత్తది తెచ్చుకోవాల్సిందే.. చిన్న వర్షానికి హైదరాబాద్ మునిగి పోతుంటే ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు.