ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. దీంతో.. ఎస్ఆర్హెచ్ టీమ్ మొత్తం తీవ్ర నిరాశలో ఉంది. ఈ క్రమంలో.. తమ ప్లేయర్లకు జట్టు యజమాని కావ్యా మారన్ ధైర్యం నింపారు. 'మీరు మమ్మల్ని గర్వపడేలా చేశారు. టీ20 క్రికెట్ ఎలా ఆడాలో నిరూపించారు. ఆరెంజ్ ఆర్మీ అభిమానులంతా కాలర్ ఎగిరేసేలా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఫైనల్లో ఓడటం బాధాకరం. బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో రాణించారని చెప్పుకొచ్చింది.
SRH CEO Kaviya Maran’s angry reaction goes viral after SRH lost wickets: ఐపీఎల్ 2024లో విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సొంత గడ్డపై తేలిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో ఓడిపోయింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 35 పరుగుల తేడాతో ఓడింది. దాంతో రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో…
కోల్కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పేలవమైన బ్యాటింగ్‌తో సన్‌రైజర్స్ సునాయసంగా గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకుంది. 6 బంతుల్లో 9 పరుగులు చేయలేక ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పేరు మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఆమె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మైదానంలో తన హావ భావాలతో అందర్నీ ఆకట్టుకుంది. వికెట్ కోల్పోయినప్పుడు బాధపడి.. బౌండరీలు బాదినప్పుడు ఎగిరి గంతేసింది కావ్య పాప. కానీ మ్యాచ్…