SRH CEO Kaviya Maran’s angry reaction goes viral after SRH lost wickets: ఐపీఎల్ 2024లో విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సొంత గడ్డపై తేలిపోయింది. వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) చేతిలో ఓడిపోయింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 35 పరుగుల తేడాతో ఓడింది. దాంతో రికార్డు స్కోర్లు, వరుస విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఎస్‌ఆర్‌హెచ్ పూర్తిగా విఫలమైంది.
Also Read: Lok sabha election 2024 : 13 రాష్ట్రాలు, 88 సీట్లకు రెండో దశ ఎన్నికలు.. బరిలో రాహుల్తో పాటు పలువురు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందుగా బౌలింగ్‌లో 206 పరుగులు సమర్పించుకుంది. కమిన్స్ (55), నటరాజన్ (39), మార్కండే (42) భారీగా పరుగులు ఇచ్చారు. ఇక 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్‌ఆర్‌హెచ్ వరుస విరామాల్లో వికెట్స్ కోల్పోయింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ ఓనర్ కావ్య మారన్ మోహం చిన్నబోయింది. అబ్దుల్ సమద్ (10) ఔటైన తర్వాత కావ్య షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. ‘అరెరే.. ఆడేది మీరేనా’ అన్నట్లు ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చారు. ఫక్ అంటూ నిరాశకు లోనయ్యారు. ఆర్‌సీబీ వికెట్లు పడినప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్య.. తమ బ్యాటర్లు అవుట్ అవుతుంటే అసహనానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
#RCB Rocked 😎
Kavya Maran Shocked 😮💨
Congratulations RCB 😍#RCBvsSRH #SRHvRCB#ViratKohli𓃵pic.twitter.com/xISW2H2cWG— Mohammed Aziz (@itsmeaziz07) April 25, 2024