అమెరికాకు వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శంషాబాద్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు. కవితకు సంబంధించిన ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. "టీం కవితక్క అంటూ" కటౌట్లు కనిపిస్తున్నాయి. కానీ.. ఈ బ్యానర్లలో ఎక్కడ కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కనిపించడం లేదు.
మైడియర్ డాడీ అంటూ రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్ దేవుడని.. కానీ ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ముందుకు పోతుందని వెల్లడించారు. తనకు పార్టీ, కేసీఆర్‌తో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు సంబర పడొద్దని.. వాళ్లకు కోతికి కొబ్బరి చిప్పదొరికినట్లైందన్నారు.