Kurnool Bus Accident: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు ఇంధన ట్యాంకర్‌ను బైక్ ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమయ్యింది.
Bus Accident: కర్నూలులో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాద స్థలాన్ని ఆమె పరిశీలించారు. "బైక్ బస్సు కిందకు వెళ్లడంతో.. డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయింది. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారు. ఇప్పటివరకు 11 మృతదేహాలు వెలికితీశాం. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడు. 20 మంది క్షేమంగా బయటపడ్డారు." అని కలెక్టర్ సిరి తెలిపారు.
Bus Fire Accident: కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసినట్టు తెలిసింది. ఇన్సూరెన్స్ పాలసీ గతేడాదితో ముగిసిపోయింది. టాక్స్ కూడా గతేడాదితో ముగిసింది. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదికి ఎక్స్పైర్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది.