ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కోకాపేటలోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. “డీజీపీ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి. రాజకీయ ప్రేరేపిత కేసుల్లో తొందరపాటు పనిచేయదు. బెయిలబుల్ సెక్షన్స్ లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణం. ఇలాంటి కేసుల్లో నాయకులు చెబితే వినడం కాదు, చట్టాలకు లోబడి పని చేయాలి. బెయిలబుల్ కేసులు అని తెలిసి రాత్రంతా ఇబ్బంది పెట్టారు. బెయిలబుల్ సెక్షన్లకు…
నిన్న రాత్రి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. ఎమ్మెల్యేపై ఇప్పటికే వన్ టౌన్ లో మూడు, త్రీ టౌన్ లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన ఫిర్యాదుల మేరకు..మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదు…
కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా, హైఅలర్ట్ కొనసాగింది. ఎమ్మెల్యే కౌశిక్‌ను పోలీసులు రాత్రంతా త్రీ టౌన్ పీఎస్ లోనే ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాటు చేశారు. రాత్రి ఒంటిగంటకు అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్ లీగల్ టీంకు తెలిసింది. రాత్రి త్రీ టౌన్ లోనే వైద్య పరీక్షలు పూర్తి చేశారు. మరి కాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.