బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం గురించి రోజుకో వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ఈ ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు వెల్లడించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద ఎత్తున పెళ్లికి సిద్ధమయ్యారు.…