బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం గురించి రోజుకో వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ఈ ప్రేమపక్షులు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారని కత్రినా కైఫ్ సన్నిహితులు వెల్లడించారు. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు పెద్ద ఎత్తున పెళ్లికి సిద్ధమయ్యారు. రాజస్థాన్‌లో జరిగే ఈ వివాహ వేడుకల్లో డిసెంబర్ 7, 8 తేదీల్లో వరుసగా సంగీత్, మెహందీ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
Read Also : టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ దర్శకుడు కన్నుమూత
కత్రినా , విక్కీ బృందాలు విమాన టిక్కెట్లను బుక్ చేయడంలో, జంటను ఆశీర్వదించడానికి వచ్చే అతిథులందరికీ వసతిని నిర్వహించడంలో బిజీగా ఉన్నారు. ఈ భారీ బాలీవుడ్ వెడ్డింగ్‌కు 200 మంది అతిధులు హాజరు కానున్నారు. పెళ్లికి మరికొద్ది రోజులే మిగిలి ఉండడంతో సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. వధూవరులుగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ సబ్యసాచి దుస్తువులు, అబు జానీ మెహందీ, మనీష్ మల్హోత్రా సంగీతం, గూచీ రిసెప్షన్ వంటి వేడుకలు జరుగబోతున్నాయి.