గత రెండు వారాలుగా బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్న విషయం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. మూడుముళ్లు పడ్డాక గానీ అప్పటి వరకూ వారిద్దరి మీద వచ్చిన లవ్ రూమర్స్, అలాగే పెళ్లి వార్తల గురించి క్లారిటీ ఇవ్వలేదు ఈ సెలెబ్రిటీ కపుల్. పెళ్లయ్యేదాకా మౌనంగా ఉండి, ఏడడుగులు నడవగానే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా కత్రినా పెళ్ళికి హాజరు…