గత రెండు వారాలుగా బాలీవుడ్ మీడియాతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా మాట్లాడుకుంటున్న విషయం కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి గురించే. మూడుముళ్లు పడ్డాక గానీ అప్పటి వరకూ వారిద్దరి మీద వచ్చిన లవ్ రూమర్స్, అలాగే పెళ్లి వార్తల గురించి క్లారిటీ ఇవ్వలేదు ఈ సెలెబ్రిటీ కపుల్. పెళ్లయ్యేదాకా మౌనంగా ఉండి, ఏడడుగులు నడవగానే ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా కత్రినా పెళ్ళికి హాజరు కాగా డిసెంబర్ 9న వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
Read Also : ఫ్యాన్సీ ధరకు “శ్యామ్ సింగ రాయ్” శాటిలైట్ రైట్స్
అయితే పెళ్లి తరువాత కూడా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి, వారి పెళ్లి తర్వాత వారి ప్రణాళికల గురించి మీడియాలో, సోషల్ మీడియాలో అనేక కథనాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. తాజాగా వార్త ఏమిటంటే ఈ జంట తమ హనీమూన్ కోసం యూరప్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంకా వారి హనీమూన్ ఐరోపాలోని ఒక ప్రదేశం లేదా రెండు ప్రాంతాలకే పరిమితం కాదట. మొత్తం యూరప్ నే చుట్టి రానున్నారట. అందుకే హనీమూన్ కనీసం 2 నెలల పాటు కొనసాగుతుందని అంటున్నారు. ఈ హనీమూన్ ప్లాన్ విక్కీ ఆలోచనేనట. పెళ్లి పూర్తిగా కత్రినా ఇష్టప్రకారమే జరగడంతో హనీమూన్ ట్రిప్ మాత్రం విక్కీ కి నచ్చినట్టుగా ప్లాన్ చేశాడని అంటున్నారు.