Katchatheevu: లోక్‌సభ ఎన్నికల ముందు తమిళనాడులో చర్చనీయాంశంగా మారిన ‘‘కచ్చతీవు’’ దీవుల వ్యవహారం మరోసారి రాజకీయాంశంగా మారింది. 1974లో భారత సార్వభౌమాధికారం కింద ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని అప్పటి ప్రధాని ఇండిరా గాంధీ శ్రీలంకకు అప్పగించింది. ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి సెల్వపెరుంతగై ప్రశంసించారు. దీనిపై బీజేపీ తమిళనాడు చీఫ్ కే. అన్నామలై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Katchatheevu: ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కచ్చతీవు దీవుల అంశం చర్చనీయాంశంగా మారింది. 1970లలో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం భారత్‌కి చెందిన హిందూ మహాసముద్రంలోని కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ప్రధాని నరేంద్రమోడీతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది.