Simla Agreement: భారత్‌పై పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తూనే ఉంది. పహల్గామ్ దాడి కూడా ఈ కోవకు చెందిందే. లష్కరే తోయిబా అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 26 మంది ప్రాణాలు తీసుకున్నారు. దీంతో, భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే, ‘‘సింధు జలాల ఒప్పందాన్ని’’ భారత్ రద్దు చేసుకుంది. అట్టారీ బోర్డర్‌ని మూసేసింది.పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలు దిగుతోంది. భారత్‌తో వాణిజ్యాన్ని రద్దు చేసుకుంది.…
Pakistan: పాకిస్తాన్, భారత్ చర్యలపై ప్రతీకార చర్యలకు దిగింది. గురువారం పాకిస్తాన్ ‘‘సిమ్లా ఒప్పందం’’ సహా భారత్‌తో ఉన్న అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలుపుదల చేసుకునే హక్కును వినియోగించుకుంటామని తెలిపింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షతన ఈ రోజు జాతీయ భద్రత కమిటీ(ఎన్ఎస్‌సీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్మీ అధికారులతో పాటు ఆ దేశంలోని కీలక అధికారులు హాజరయ్యారు.
India: పాకిస్తాన్‌లో ఉన్న భారతీయలు వెంటనే దేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ దాడి తర్వాత భారతీయులకు కేంద్రం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
Visas to Pak: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ జాతీయులకు వీసాలను కూడా రద్దు చేస్తు్న్నట్లు బుధవారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 27 నుంచి పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 29 వరకు మాత్రమే వైద్య వీసాలకు అనుమతించింది.
ఇదిలా ఉంటే, భారత్ ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేయడంపై పాకిస్తాన్ తీవ్రంగా స్పందించింది. భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ‘‘జలయుద్ధం’’గా పేర్కొంది. ఈ చర్యలను చట్టవిరుద్ధమైనవిగా పేర్కొంది. భారత తీరును చట్టబద్ధంగా సవాల్ చేస్తామని, ప్రపంచ బ్యాంక్ వంటి ప్రపంచ సంస్థ మధ్యవర్తిత్వంతో జరిగిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా నిష్క్రమించలేదని పాకిస్తాన్ తెలిపింది.
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్‌లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు.
Pahalgam terror attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాది యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 28 మంది అమాయకపు టూరిస్టులు ప్రాణాలు వదిలారు. నలుగురి నుంచి 6 మంది వరకు టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముగ్గురిని భద్రతా సంస్థలు గుర్తించాయి.
Danish Kaneria: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ దానిష్ కనేరియా ఆగ్రహం సొంత దేశంపైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పాకిస్తాన్ తరుపున ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన అతికొద్ది మంది హిందూ ఆటగాళ్లలో కనేరియా ఒకరు. మంగళవారం జరిగిన ఉగ్ర ఘటనపై ఆయన మరోసారి స్పందించారు.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇప్పటివరకు 28 మంది మరణించారు. ఈ సంఘటనను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు కూడా ఖండించారు. పలు దేశాధినేతలు మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ కష్టకాలంలో భారత్‌కి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడిపై భారత్ దేశం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన టూరిస్టుల్ని పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ చంపేశారు. ఈ దాడిలో 28 మంది మరణించారు. దాడికి సంబంధించిన కార్యాచరణ మొత్తం దాయాది దేశం పాకిస్తాన్ జరిగినట్లు మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు గుర్తించాయి. కరాచీ, పీఓకేలోని ముజఫరాబాద్‌తో దాడికి సంబంధాలు ఉన్నట్లు కనుగొన్నారు.