టెర్రర్ ఫండింగ్ కేసులో కాశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్‌కు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేందుకు యాసిన్ మాలిక్ వివిధ దేశాలు, సంస్థల నుంచి నిధులు సేకరించారనే అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. మే 19న ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్ట్ యాసిన్ మాలిక్ ని టెర్రర్ ఫండింగ్ కేసులో దోషిగా తేల్చింది. దీంట్లో భాగంగా బుధవారం న్యాయస్థానం ముందు యాసిన్ మాలిక్ ను అధికారులు హాజరుపరిచారు.…