Pahalgam Attack: కశ్మీర్ లోయలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి వెనుక కుట్ర నెమ్మదిగా బయటపడుతోంది. ఉగ్రవాదులతో నాలుగుసార్లు సమావేశమై, వారికి లాజిస్టికల్ మద్దతును అందించి, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లను సరఫరా చేసిన ఓ వ్యక్తిని జమ్మూ కశ్మీర్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. నిందితుడి పేరు 26 ఏళ్ల మొహమ్మద్ యూసుఫ్ కటారి. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రకారం.. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులు సులేమాన్ అలియాస్ ఆసిఫ్, జిబ్రాన్, హంజా…
Amarnath Yatra: పహల్గామ్ ఉగ్రదాడ నేపథ్యంలో గట్టి భద్రత మధ్య బుధవారం అమర్‌నాథ్ యాత్రకు సంబంధించి తొలి బృందం జమ్మూ నుంచి బయలుదేరుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర గురువారం లాంఛనంగా ప్రారంభం కానుంది. శ్రీ అమర్‌నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ కూడా అయిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా బుధవారం పహల్గామ్ మరియు బల్తాల్‌లోని బేస్ క్యాంపుల నుంచి యాత్రికుల మొదటి బృందాన్ని జెండా ఊపి ప్రారంభిస్తారు.
Sri Krishna Devarayalu: తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దీక్షిత్ వివరించారని టీడీపీ నాయుకుడు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తీవ్రవాదం, జాతీయ భద్రత పై సహకరిస్తామని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. గత పదేళ్ళుగా కాశ్మీర్ లో ఏ విధంగా భద్రతను పెంచారో వివరించారని, తీవ్రవాద చర్యలను భద్రత సిబ్బంది ఏవిధంగా ఎదుర్కొంటున్నారో తెలిపారని అయ్యన అన్నారు. జాతీయ భద్రతపై ఏ…
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడికి గురైన బాధితులు తాజాగా ఎన్టీవీతో సంభాషించారు. 2017లో కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర నుండి తిరిగి వస్తున్న సమయంలో వారి చేదు అనుభవాలను వివరిస్తూ ఆ సంఘటనలో వారు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. అనంతనాగ్ ప్రాంతంలో వారు బస్సు ఆపి, దాబా దగ్గర భోజనం చేసిన తరువాత తిరిగి బస్సులోకి ఎక్కగానే దాడి ప్రారంభమైందని తెలిపారు. దాదాపు 23 సంవత్సరాల్లోపు వయస్సున్న కొంతమంది యువకులు వచ్చి మూడు గ్రానైడ్లను…