Sri Krishna Devarayalu: తీవ్రవాద చర్యలను ఎదుర్కోవడానికి చేపట్టిన చర్యల అఖిలపక్ష సమావేశంలో ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ దీక్షిత్ వివరించారని టీడీపీ నాయుకుడు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తీవ్రవాదం, జాతీయ భద్రత పై సహకరిస్తామని, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన అన్నారు. గత పదేళ్ళుగా కాశ్మీర్ లో ఏ విధంగా భద్రతను పెంచారో వివరించారని, తీవ్రవాద చర్యలను భద్రత సిబ్బంది ఏవిధంగా ఎదుర్కొంటున్నారో తెలిపారని అయ్యన అన్నారు. జాతీయ భద్రతపై ఏ చర్యలు తీసుకున్నా టీడీపీ ఎప్పుడు సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
జాతీయ భద్రత అంశంలో రాజకీయాలకు తావులేదని, అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ఇదే అంశాన్ని చెప్పాయని తెలిపారు. రాజకీయం వేరు, జాతీయ భద్రత వేరు.. పదిరోజుల క్రితమే “పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ” సభ్యులు శ్రీనగర్ వెళ్ళారని తెలిపారు. అలాగే జమ్ము కాశ్మీర్ లో ఆర్థిక వ్యవస్థ ఇటీవల పుంజుకుందని, అలంటి సమయంలో ఇలాంటి ఘటన జరిగిందని ఆయన అన్నారు. తీవ్రవాదాన్ని అరికట్టడమే కాకుండా తిరిగి సాధారణ పరిస్థితులు తీసుకురావాలని ఆయన అన్నారు. సింధూ నది జలాల అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చామని ఆయన తెలిపారు. దేశ సమగ్రత విషయంలో భిన్నంగా ఎవరూ సమావేశంలో మాట్లాడలేదని, అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతిచ్చాయని ఆయన వివరించారు.