తమిళనాడు కరూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో తీవ్ర ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ తమిళ హీరో విజయ్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ప్రేక్షకులు తొక్కిసలాటకు గురై కొందరు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ విషాద ఘటన పై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. “తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ర్యాలీలో తొక్కిసలాట చాలా విషాదకరం. ఈ విషయం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.…
తొక్కిసలాట ఘటనపై టీవీ కే పార్టీ లో చర్చ జరిగింది. తొక్కిసలాట ఘటనకు కారణం స్టాలిన్ ప్రభుత్వమే అంటూ టీవీకే పార్టీ నేతలు మండిపడుతున్నారు. తాము అడిగిన ప్రాంతంలో కాకుండా చిన్నపాటి రోడ్డులో సభ ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడంతో.. ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… చెన్నై దుండిగల్ జిల్లా కరూర్ లో టీవీ కే పార్టీ అధ్యక్షుడు హీరో విజయ్ రోడ్ షో నిర్వహించారు. దీంతో హీరో విజయ్ ను చూసేందుకు భారీగా…
కరూర్‌లో టివికే పార్టీ అధినేత, నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీ ఘోర విషాదానికి దారితీసింది. ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో మృతుల సంఖ్య 39కి పెరిగింది. ప్రస్తుతం 58 మంది తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం సీఎం స్టాలిన్ గాయపడిన వారిని ఆస్పత్రిలో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ, చనిపోయిన వారికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష పరిహారం ప్రకటించారు. అలాగే తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశాలు…