కారుణ్య నియామకం కింద తెలంగాణా వాసులకు ఉద్దేశించిన ఉద్యోగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని నియమించడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావన సందర్భంగా ఆమె ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, దాని ప్రకారం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టాలు కూడా చేసిందన్నారు. అయితే, కొత్త కాంగ్రెస్…