దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా అత్యంత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో 10 విమానాల రాకపోకలను దారి మళ్లించారు.