Karnataka: కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూర్‌లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. ఐటీ ఉద్యోగులు ‘‘ ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత ప్రతీ ఉద్యోగి హక్కు’’ నినాదమిస్తున్నారు.