కర్ణాటకలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కన్నడ సినీ స్టార్ శివరాజ్‌కుమార్ సతీమణి గీతా శివ రాజ్‌కుమార్ జేడీఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నెలకొంది.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రచార జోరును పెంచాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇవాళ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక హోటల్‌లో ఆమె సందడి చేశారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీలు విమర్శల జోరు పెంచాయి. బాగల్ కోట్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.
మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం కర్ణాటకలోని విజయపురలో భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రత్యేకంగా రూపొందించిన వాహనం పైన నిలబడి, వీధుల్లో, సమీపంలోని భవనాలపై గుమిగూడిన ప్రజలపై రాహుల్ గాంధీ అభివాదం చేశారు.
కర్ణాటకలో అధికారం కోపం కాంగ్రెస్, బీజేపీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అధికారాన్ని కొనసాగించాలని కాషాయ పార్టీ నేతలు భావిస్తుండగా.. మెజార్టీ సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హస్తం నేతలు యోచిస్తున్నారు. మే 10న జరగనున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ అంశం ప్రభావం చూపదని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య అన్నారు.
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. కర్ణాటకలో మే 10న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి మే 13న ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియాజకవర్గం సీటుకు ఖాళీ ఏర్పడింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తారా? అయితే.. ఎప్పుడు..? అనే చర్చ తెరమీదకు వచ్చింది.