పుట్టినరోజు వేడుకలకు వెళ్లివస్తుండగా ఒకే కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కారు అతివేగంగా ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన ఐదుగురిలో నలుగురు మహిళలే. కర్ణాటక లోని కుకనూర్ తాలూకా బిన్యాల్ గ్రామానికి చెందిన దేవప్ప కొప్పడ్ తన కుటుంబంతో కలిసి కొప్పల్ లోని తమ బంధువుల ఇంట్లో పుట్టినరోజు పార్టీకి హాజరయ్యారు. నిన్న శనివారం రాత్రికి తిరగివస్తుండగా వారు ప్రయాణం చేస్తున్న కారు కుకనూర్ భానుపుర్ వద్దకు రాగా…