కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరపూరిత చర్య ఎలా అవుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది. జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్…